మహేష్ గారాలపట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాలా..! చిన్నతనం నుంచే చలాకీ పిల్లగా సూపర్ స్టార్ అభిమానులను ఫిదా చేస్తున్న ఆమె సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మహేష్ సినిమాల్లోని పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ ఆ వీడియోలను తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఓ రేంజ్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. మరోవైపు తండ్రి మహేష్ బాబుతో నటించే హీరోయిన్స్ అందరితో కలివిడిగా ఉంటూ ఫ్రెండ్‌షిప్ చేస్తోంది సితార. ఈ నేపథ్యంలో ఈ చిన్ని సెలబ్రిటీపై మిల్కీ బ్యూటీ స్వీట్ కామెంట్ చేసింది. మహేష్ బాబుతో కలిసి ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేస్తోంది తమన్నా. 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ వాణిజ్య ప్రకటనకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ షూట్‌లో భాగంగా తమన్నాను కలిసి సరదాగా కాసేపు గడిపింది మహేష్ డాటర్ సితార. ఈ మేరకు మిల్కీ బ్యూటీతో ఓ ఫోటో దిగిన సితార 'నేను ఎవరిని కలిశానో చూడండి' అంటూ ఆ పిక్ షేర్ చేసింది. ఈ ఫోటోపై రియాక్ట్ అయిన తమన్నా.. 'సీతు పాప నువ్వు ఇంత తొందరగా ఎదగకు ప్లీజ్' అంటూ ఫన్నీగా ముద్దులతో ఉన్న ఎమోజీలను జత చేసింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్న మహేష్ బాబు.. షూటింగ్ గ్యాప్‌లో ఇలా తమన్నాతో కమర్షియల్ యాడ్ షూట్‌లో పాల్గొంటున్నారు. స్టార్ హీరోగానే గాక బిజినెస్‌మెన్‌గా సత్తా చాటుతూ పలు సినిమాలు నిర్మిస్తున్న ఆయన, వీలు చిక్కినప్పుడల్లా యాడ్ షూట్స్ చేస్తుంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ఈ 'సర్కారు వారి పాట' మూవీ రిలీజ్ కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cHCNxW
v
No comments:
Post a Comment