Tuesday, 16 March 2021

Tamannaah: ముచ్చటగా మూడోసారి మహేష్ బాబుతో తమన్నా.. ఈ సారి ఇలా స్కెచ్చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్!

సూపర్ స్టార్ , మిల్కీ బ్యూటీ ఇద్దరూ కలిసి మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నారట. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఆగడు' సినిమాలో ఆడిపాడిన ఈ జోడీ.. చాలా ఏళ్ల తర్వాత రీసెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకున్నారు. ఆ రెండు సందర్భాల్లో సిల్వర్ స్క్రీన్‌పై ఈ ఇద్దరి కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరినీ సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారట అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్. మహేష్ బాబు, తమన్నా కలిసి చేయబోయేది సినిమా కాదు యాడ్ షూట్. కమర్షియల్‌ యాడ్‌ రూపంలో మెస్మైరైజ్ చేయనుందట ఈ జోడీ. హవెల్స్‌ ఎలక్ట్రిక్‌ బల్బుల యాడ్‌లో వీరిద్దరూ నటిస్తున్నట్లు తెలిసింది. ఈ యాడ్‌ను ప్రత్యేకంగా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగా షూట్ చేస్తుండటం విశేషం. తనదైన స్టైల్ కెమెరా అప్పీయరెన్స్‌తో చూపించేలా స్కెచ్చేశారట సందీప్. వాణిజ్య ప్రకటనే అయినా మహేష్ బాబు, తమన్నా లాంటి స్టార్స్‌తో పాటు సందీప్ రెడ్డి భాగమవుతున్నారంటే ఈ వీడియో ఓ రేంజ్ లోనే ఉంటుంది కావచ్చు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30OgmSo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...