Monday, 15 March 2021

Sri Reddy: సినీ పెద్దల జాతకాలు బయటపెట్టే ప్లాన్ చేసిన బోల్డ్ బ్యూటీ.. నిర్మాత ఆవేదన

సినిమాల్లో అవకాశాలు ఇస్తా అని చెప్పి కొందరు సినీ ప్రముఖులు లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని పెద్ద ఉద్యమమే లేవదీసిన సంగతి తెలిసిందే. 'కాస్టింగ్ కౌచ్' పేరుతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి. అప్పటి నుంచి ఈమె పేరు దేశం మొత్తం మారుమోగిపోతోంది. దానికి తోడు సోషల్ మీడియాను వేదికగా ఎప్పటికప్పుడు ప్రముఖులపై వివాదాస్పద కామెంట్స్ చేయడం, బోల్డ్ ఫొటోలతో ఫాలోవర్స్ పెంచుకోవడం హాబీగా పెట్టుకుంది ఈ సంచలన తార. ఈ పరిణామాల నడుమ రూపొందించి సినీ పెద్దల జాతకాలు బయటపెట్టే ప్లాన్ చేశారు మేకర్స్. 'రెడ్డీ డైరీ' అనే పేరుతో శ్రీ రెడ్డి జీవితంలోని కొన్ని కీలకమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాలని స్కెచ్ వేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన రాజంగ‌మ్ ఈ శ్రీ రెడ్డి బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నారు. హీరోయిన్ కావాల‌నే ఆశతో ఉన్న ఓ అమ్మాయిని ఇండ‌స్ట్రీలోని పెద్దలు ఎలా వాడుకున్నారనేది ఈ మూవీలో చూపించబోతున్నారట. కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకనిర్మాతలకు బెదిరింపులు కాల్స్ రావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. రెడ్డీ డైరీ నిర్మాత ర‌వి దేవ‌న్ తాజాగా తమకు కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఈ సినిమా షూటింగ్ ఆపలేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కొందరు బెదిరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సినిమాను ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. చూడాలి మరి ఇంతకీ ఈ 'రెడ్డీ డైరీ' ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38EJm3a
v

No comments:

Post a Comment