Saturday, 27 March 2021

వైరల్ వీడియో: RRR సెట్స్‌పై రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. మిన్నంటిన సంబరాలు.. జక్కన్న ఆత్మీయ ఆలింగనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేను మెగా అభిమాన లోకంతో పాటు జక్కన్న టీమ్ మొత్తం ఎంజాయ్ చేసింది. నేడు (మార్చి 27) చెర్రీ 36వ పుట్టినరోజు సందర్భంగా గత రాత్రి సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో మెగా సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం RRR సెట్స్‌పై రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. రాజమౌళి టీమ్ అంతా కలిసి సెట్స్ మీదే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక జరిపారు. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అంటూ భారీ కటౌట్ ఏర్పాటు చేయడమే గాక బాణాసంచా కాల్చుతూ చెర్రీని ఖుషీ చేసింది జక్కన్న టీమ్. అందరూ కేక్ తినిపిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జక్కన్న ఏర్పాటు చేసిన ఈ సర్‌ప్రైజింగ్ వేడుక చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అయిన రామ్ చరణ్.. టీమ్ మొత్తాన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపింది RRR టీమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. మరోవైపు తోటి హీరోలు, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రామ్ చరణ్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. చెర్రీ బర్త్ డే సందర్భంగా RRR నుంచి అల్లూరి సీతారామరాజు లుక్ రిలీజ్ చేయడమే గాక, ఇలా సెట్స్‌పై గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం పట్ల మెగా అభిమాన లోకం ఫిదా అవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ RRR మూవీ అక్టోబ‌ర్ 13వ తేదీన విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ctvA5I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...