Monday, 15 March 2021

RRR: ఆలియా భట్ లుక్.. లేట్ అయితే అయిందిలే కానీ జక్కన్న ట్రీట్ మాత్రం అదిరింది!!

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ RRR నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి. ఈ మూవీలో 'సీత'గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ లుక్ రిలీజ్ చేసి మెగా, నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. టాలీవుడ్ తెరపై తొలిసారి కనిపించబోతున్న ఆలియా.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టేసింది. ఈ లుక్ చూస్తుంటే సీతగా రామ్ చరణ్ పర్ఫెక్ట్ జోడీ ఆలియా అనిపిస్తోంది. తండ్రి మహేష్ భట్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆలియా పుట్టిన రోజు కానుకగా RRR నుంచి సీత పోస్టర్ రిలీజ్ చేశారు జక్కన్న. రామరాజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అమ్మాయిగా ఈ పోస్టర్‌లో యమ అట్రాక్ట్ చేస్తోంది ఆలియా. నిజానికి ఈ లుక్‌ను నేటి ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన రాజమౌళి.. కాస్త ఆలస్యంగా వదిలారు. కానీ, ఈ పోస్టర్ చూశాక ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. లేట్ అయితే అయిందిలే కానీ అదిరిపోయే లుక్ రిలీజ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా కనిపించబోతున్నారు. చెర్రీ సరసన ఆలియా భట్, సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ RRR మూవీ రూపొందిస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38DPysj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...