Friday, 19 March 2021

Roja: వాడు రాత్రి ఫోన్ చేసి అలా అడిగాడు.. అసలు విషయం బయటపెట్టిన వర్ష.. రోజా షాకింగ్ రియాక్షన్

బుల్లితెరపై ఓ జంట క్లిక్ అయితే ఇక ఏ రేంజ్‌లో వాడతారో అందరికీ తెలిసిందే. మామూలుగా ప్రతీ షోలో ఏదో ఒక జంటను క్రియేట్ చేసి పైకి లేపేందుకు ట్రై చేస్తుంటారు. అలా సుధీర్ రష్మీ జోడి గత ఏడేళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ మధ్య ఇమాన్యుయేల్ జోడి చేస్తోన్న హల్చల్ గురించి అందరికీ తెలిసిందే. కలర్ ఫోటో సినిమా రేంజ్‌లో వీరి ట్రాక్ బుల్లితెరపై వర్కవుట్ అయింది. స్పెషల్‌గా ఈ ఇద్దరి మీద కూడా ఈవెంట్ చేసేశారు. ఈ జోడిని బాగా ప్రమోట్ చేసేందుకు జబర్దస్త్ టీం కూడా కృషి చేస్తోన్నట్టు కనిపిస్తుంది. రోజా అయితే ఈ ఇద్దరిని నిలబెట్టి మరీ వారి ప్రేమ గురించి ప్రశ్నలు అడుగుతారు. ఇక ఆ సమయంలో వర్ష చెప్పే మాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కలర్ ఏముంది మేడం.. మనసు ముఖ్యం అంటూ మీదున్న ఇష్టాన్ని చెప్పేస్తుంటారు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు.. నా గురించి ఆలోచిస్తాడు.. నన్ను గౌరవిస్తాడు.. ఇంత కంటే ఏం కావాలి అంటూ ఆ మధ్య ఇమాన్యుయేల్ గురించి వర్ష చెప్పిన మాటలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అలా సందర్భం వచ్చిన ప్రతీసారి వర్ష తన మనసులోని మాటలను చెప్పేస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో రోజా అడిగితే.. ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే అన్నట్టుగా పరోక్షంగా హింట్లు ఇస్తుంటారు. తాజాగా మరోసారి వర్ష తన మనసులోని విషయాన్ని బయటపెట్టేశారు. నేను ఆత్మహత్య చేసుకున్నాను ఏదో ఓ యూట్యూబ్‌లో రాశారు.. రాత్రి ఫోన్ చేసి ఎలా ఉన్నావ్.. బాగానే ఉన్నావ్ కదా? ఏం జరగలేదు కదా? అని అడిగాడు. ఆ సమయంలో అనిపించింది వీడు నా కోసం ఇంత ఆలోచించాడా? అని.. వర్ష చెప్పడం.. నిజమైన ప్రేమ అని రోజా అనడంతో ఇద్దరూ తెగ మురిసిపోయారు. ఆ సమయంలో వీడు నా వాడే అని అనిపించాడు అంటూ ఇమాన్యుయేల్ గురించి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వర్ష చెప్పేశారు. ఇక వర్ష అలా తన మనసులో మాట చెప్పడంతో జబర్దస్త్ టీం మేట్స్ షాక్ అయ్యారు. అరెరె అంటూ రోజా సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇమాన్యుయేల్, వర్ష ఇద్దరూ కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ షోలో ఈ జంటే హైలెట్ అవుతున్నారు. అందులో వర్ష ఇమాన్యుయేల్ చేసే రొమాన్స్, వారి ట్రాక్, కామెడీ స్కిట్లు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qf41Eu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...