Monday, 15 March 2021

Prabhas: 'సలార్' స్పెషల్ సాంగ్.. పక్కా ప్లాన్‌తో కేజీఎఫ్ బ్యూటీని రంగంలోకి దించుతున్న డైరెక్టర్!

పాన్ ఇండియా స్టార్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'రాధే శ్యామ్' షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' సినిమాలో నటిస్తున్నారు. కాగా, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సలార్ మూవీ గురించిన ఓ స్పెషల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్.. మునుపెన్నడూ ఏ సినిమాలో చూడని రేంజ్‌లో ఉండేలా ఆ సాంగ్ చిత్రీకరించబోతున్నారట. భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్న డైరెక్టర్.. ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ స్కెచ్చే వేస్తున్నారట. ఈ మేరకు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని రంగంలోకి దించుతున్నారని సమాచారం. యాక్షన్ సినిమా అయినా ఈ సాంగ్‌తో ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'సలార్' కోసం కొంతమంది కేజీఎఫ్ టెక్నీషియన్స్‌ని తీసుకున్న ఆయన, ఇప్పుడు శ్రీనిధి శెట్టిని కూడా తీసుకున్నారని తెలుస్తుండటం ప్రభాస్ అభిమానులను హుషారెత్తిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటినుంచే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. సో.. చూడాలి మరి ప్రశాంత్ నీల్ స్పెషల్ సాంగ్ గురించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ ఎప్పుడొస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bSyIrI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...