Tuesday, 23 March 2021

Jayalalithaa Biopic: తలైవి ట్రైలర్ రిలీజ్.. 'అమ్మ'గా కంగనా రనౌత్ పవర్ చూడండి

ఓ వైపు పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ చకచకా కంప్లీట్ చేస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ . ఆమె లీడ్ రోల్ పోషించిన 'తలైవి' షూటింగ్ ఫినిష్ చేసుకొని ఏప్రిల్ 23న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలతో ఆ అంచనాలకు రెక్కలు కడుతున్న చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కంగనా పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ ట్రైలర్ 3 నిమిషాల 8 సెకనుల నిడివితో కూడి ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘అమ్మ’ పాత్రలో కంగనా ఒదిగిపోయిందని ట్రైలర్ లోని సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతోంది. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ పాత్ర పోషిస్తున్న అరవింద్‌స్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్‌ ఈ మూవీలో ఆయన రోల్ ప్రాధాన్యతను తెలుపుతోంది. ''మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది.. జయ'' అంటూ కంగనా చెబుతున్న డైలాగ్ సినిమా రేంజ్ ఏంటనేది స్పష్టం చేస్తోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై ఉన్న హైప్‌ని రెట్టింపు చేసిందనే చెప్పుకోవాలి. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'తలైవి' చిత్రానికి విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్ నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, అరవిందస్వామి, జిషు సేన్‌గుప్తా ముఖ్యపాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f5tL0w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...