Sunday, 21 March 2021

నాకు అంత సీన్ లేదు కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు.. నాగబాబు కామెంట్స్ వైరల్

మెగా బ్రదర్ ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఎంత హాస్యాన్ని పండిస్తారో.. ఎంత వెటకారంగా ఉంటారో నిహారిక ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరితే నాగబాబు చేసే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుందని, అందరినీ నవ్విస్తుంటారని చెబుతుంటారు. ఆ విషయం సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్లందరికీ తెలిసిందే. ఆయన ఎలా కౌంటర్లు ఇస్తుంటారు.. పంచ్‌లు ఎలా వేస్తారో ఎన్నోసార్లు చూసి ఉంటారు. మెగా బ్రదర్ కామెడీ టైమింగ్, కౌంటర్లు వేసే తీరు, ఆయన పెట్టే పోస్ట్‌లు ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సమయంలో నాగబాబు పెట్టిన పోస్ట్‌లు సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. బాలకృష్ణ, గాడ్సే, గాంధీ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. అవి చిలికి చిలికి గాలివానలా మారే సరికి నాగబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నాగబాబు తాజాగా తన ఇన్ స్టాగ్రాంలో దుమ్ములేపారు. ఆయన తన ఫాలోవర్లు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు చెప్పారు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగితే.. వారికి అదే శైలిలో సమాధానాలు ఇచ్చారు. వాటిని చూసి మీమర్స్ సైతం ఆశ్చర్యపోయారు. నాగబాబు ఇచ్చిన ఆన్సర్స్‌పై మీమర్స్ కూడా వెరైటీ మీమ్స్ వేసేశారు. అయితే తాజాగా మీమర్స్‌తో నాగబాబు ముచ్చటించారు. మీమర్స్‌కు సరైన గుర్తింపు రావడం లేదని, చాలా మందికి వారి విలువ తెలియదని నాగబాబు అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి వీరిపై అవగాహన లేదని అన్నారు. కానీ మీమర్స్ ఎంతో శక్తివంతమైన వాళ్లని, యూత్‌కు ఇదొక ఇన్ కం జనరేట్ అయ్యే సోర్స్ అవ్వాలని కోరారు. ఇదే క్రమంలో ఓ మీమర్‌తో నాగబాబు ఇంటరాక్ట్ అయ్యాడు. అతను అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పారు నాగబాబు. మీరు ఎప్పుడైనా ఏదైనా పాత్రను రిజెక్ట్ చేసి బాధపడ్డారా? అని అడిగాడు. దానికి నాగబాబు సమాధానం ఇస్తూ.. ‘అసలు నిజం చెప్పాలంటే.. ఓ పాత్రను రిజెక్ట్ చేసే స్థాయి నాకు లేదు.. అంత సీనే నాకు లేదు.. నాకు వచ్చిన పాత్రలు నేను చేస్తాను. కానీ ఓ సారి మాత్రం చేయలేకపోయాను. సినిమాలో శ్రీహరి పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ అప్పుడు నేను ఫారిన్‌లో ఉండి చేయలేకపోయాను. కానీ నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదని అనిపిస్తుంది’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lAIJge
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...