Saturday, 13 March 2021

ఈ కథలో పాత్రలు కల్పితం ట్రైలర్: కొణిదెల కుర్రోడి హంగామా.. వెరైటీ స్టోరీ అంటూ పూరీ జగన్నాథ్ ప్రశంస

చిన్న సినిమాకు ఓ పెద్ద డైరెక్టర్ ప్రశంస లభించిందంటే మొదటి విజయం అక్కడే దక్కినట్లు లెక్క. ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ కొత్త దర్శకులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు స్టార్ డైరెక్టర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా '' మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా స్టోరీ వెరైటీగా అనిపిస్తోందని చెబుతూ ప్రశంసించారు. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో , జంటగా 'ఈ కథలో పాత్రలు కల్పితం' మూవీ రూపొందింది. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్‌, మెగా బ్రదర్ నాగబాబు రిలీజ్ చేసిన టీజర్‌ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవలే సెన్సార్ పనులను ఫినిష్ చేసుకున్న ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రశంసించడం సినిమాకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ''ఈ కథలో పాత్రలు కల్పితం టైటిల్ చాలా వెరైటీగా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. వెరైటీ స్టోరీతో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వం చాలా బాగుంది. నిర్మాత రాజేష్‌ నాయుడు గారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలొచ్చి ఇలాంటి సినిమాలు ఇంకా నిర్మించాలని కోరుకుంటున్నాను. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం కష్టపడ్డ టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు. ఎలాగైనా సినిమాల్లో రాణించాలని తపన పడుతున్న యువకుడి ఫీలింగ్స్ ఈ ట్రైలర్‌లో చూపించారు. 'స్టోరీకి నువ్ సెట్టు కావు కావు అన్నోళ్లే ఈ రోజు ఇండస్ట్రీని సెట్ చేశారు' హీరో చెబుతున్న డైలాగ్ సినిమా కథ ఎంత బాగా ఉంటుందో చెబుతోంది. పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఈ మూవీ ఓ పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని అంటున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ezon5y
v

No comments:

Post a Comment