Sunday, 7 March 2021

సింగరేణిలో ‘ఆచార్య’.. బొగ్గు గనుల్లో చిరు, చరణ్ పోరాటాలు

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ తాజా షెడ్యూల్ ఆదివారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి బొగ్గు గనుల్లో ‘ఆచార్య’ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈ సినిమాలో అతిథి పాత్ర చేస్తోన్న రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి, రామ్ చరణ్ ఇల్లందు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే పలుమార్లు జేకే5 ఉపరితల గని, అండర్ గ్రౌండ్ మైన్స్‌ను తన సాంకేతిక బృందంతో దర్శకుడు కొరటాల శివ పరిశీలించారు. జేకే5 ఉపరితల గని వ్యూ పాయింట్ నుంచి గనిలోకి దిగి, బ్లాస్టింగ్ పని జరుగుతున్న ఏరియాలు, సినిమాకు అనువైన లొకేషన్లను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లతో కలిసి పరిశీలించారు. చిత్రం యూనిట్ శనివారం నాటికే ఇల్లందు చేరుకుంది. ఆదివారం ఉదయం షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఓసిలోకి దిగింది. మొదట చిరంజీవి లేకుండానే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా, లాక్‌డౌన్ తరవాత ‘ఆచార్య’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్, ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మరో షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పుడు సింగరేణి కాలరీస్‌లో మరో షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మే 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ మూవీగా ‘ఆచార్య’ను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, రామ్ చరణ్‌కు జోడీగా అతిథి పాత్రలో పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇప్పటికే తన భాగం షూటింగ్‌ను పూజ పూర్తిచేశారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.తిరునవుక్కరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38hNqWY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...