Friday, 12 March 2021

జాతి రత్నాలు ముందు బాహుబలి నథింగ్.. కుర్ర హీరోల కామెంట్స్‌పై రానా రియాక్షన్ ఇదీ!

వెండితెరపై భల్లాల దేవుడుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బహుబలి నటుడు రానా దగ్గుబాటి.. బుల్లితెరపై షోతో హోస్ట్‌గా అలరించారు.. ఇప్పటికే సీజన్ 1, సీజన్ 2 కంప్లీట్ కాగా.. సీజన్ 3తో రెడీ అయిపోయాడు రానా. మార్చి 14 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ‘నెం.1 యారి’ సీజన్ 3 ‘ఆహా’ (ఓటీటీ)లో స్ట్రీమింగ్ కానుంది. తొలి రెండు సీజన్లు సూపర్ హిట్ కావడంతో మూడో సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలకు అనూహ్య స్పందన లభించగా.. ఫస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. జాతి రత్నాలు టీం నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ, నాగ్ అశ్విన్‌లు తొలి ఎపిసోడ్‌లో రానాతో కలిసి సందడిచేయబోతున్నారు. తాజా ప్రోమోలో.. ఈ జాతి రత్నాలు కుర్రోళ్లు ఏకంగా బాహుబలి సినిమాకే ఎర్త్ పెడుతున్నారు. రానాని బాహుబలి సినిమా తెలుసా మీకు అని నవీన్ అడగ్గా.. హా తెలుసండీ చూశాను అని రానా చెప్పగా.. ‘మా జాతి రత్నాలు ముందు బాహుబలి నత్తింగ్ సార్’ అంటూ రాహుల్ రామక్రిష్ణ పంచ్ వేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రానా.. ‘సూపర్బ్ జోక్ నాన్నా’ అంటూ గాలి తీసేశాడు. ఆ తరువాత నవీన్ ఎంతమందితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడు.. నవీన్ ఓ సూపర్ హీరోని పెళ్లి చేసుకోవాలంటే ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు లాంటి చిలిపి ప్రశ్నలతో వాళ్లతో రకరకాల ఆటలు ఆడిస్తూ ‘ఆహా’ అనేట్టుగానే చేస్తున్నాడు నెం.1 యారి హోస్ట్ రానా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30DGOhb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...