Wednesday, 24 March 2021

ఆన్ స్క్రీన్‌పై మహానటి.. ఆఫ్ స్క్రీన్‌లో మహానాటీ.. స్టేజ్‌పై దేవి శ్రీ పులిహోర.. కీర్తి స్పీచ్‌లో విలన్ నితిన్

‘చెక్’ సినిమాతో నిరాశపరిచిన నితిన్.. అంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చి మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ పాల్గొనకపోవడంతో హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరై ప్రమోషన్స్‌లో నేను కూడా అనేసి వివాదానికి ముగింపు పలికింది కీర్తి సురేష్. తాజాగా బుధవారం నాడు రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్‌లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయగా.. నితిన్, కీర్తి సురేష్‌లతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి, రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ పాల్గొన్ని సందడి చేశారు. కాగా కీర్తి సురేష్ మాట్లాడుతున్న సందర్భంలో దేవి శ్రీ ప్రసాద్.. శ్రీముఖి దగ్గర నుంచి మైక్ తీసుకుని గట్టిగానే పులిహోర కలిపారు. ‘కీర్తి.. సినిమాల్లో ఆన్ స్క్రీన్ మహానటి.. ఆఫ్ స్క్రీన్ మహానాటీ అంటూ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు దేవి శ్రీప్రసాద్. ఆ తరువాత మాట్లాడిన కీర్తి సురేష్.. రాజమండ్రి ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచింది. దేవి శ్రీ ప్రసాద్‌తో ఇది నా మూడో సినిమా.. తప్పుకుండా హ్యాట్రిక్ హిట్ కొడతాం అని నమ్మకం ఉంది. నితిన్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. నా బెస్ట్ కో స్టార్ అతను. మీకో విషయం చెప్పాలి.. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నేను విలన్‌లా కనిపిస్తున్నాను కానీ.. అది నిజం కాదు.. నిజానికి ఇందులో నితిన్ విలన్. సెకండాఫ్‌లో నేను రివేంజ్ తీర్చుకుంటాను. ట్రైలర్ చూసి ఫిక్స్ అయిపోకండి. మార్చి 26న ఈ సినిమా విడుదల కాబోతుంది అందరూ థియేటర్స్‌కి వచ్చి చూడండి’ అంటూ తన స్పీచ్‌తో ఆకట్టుకుంది కీర్తి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tX3jup
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...