Tuesday, 9 March 2021

బన్నీ ముందు తన కోరిక బయటపెట్టిన అనసూయ.. గుండె రాయి చేసుకుని చెప్తున్నా అంటూ ‘చావు కబురు చల్లగా’

కార్తీకేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం జానీ మాస్టర్‌.. అందుకే ఆయనతోనే మొదలు పెడతా.. ఈ సినిమా కథ ఒక ఎత్తైతే ‘పైన పటారం లోన లొటారం’ సాంగ్ బ్యాక్ కథ మరో ఎత్తు. ఈ సాంగ్ చేయడానికి చాలా ఆలోచించా.. కానీ సాంగ్ లిరిక్స్ విన్న తరువాత ఖచ్చితంగా చేయాలని అనుకున్నా. ఈ పాట రాసిన సనారే వయసులో చిన్నవాడే కానీ.. జీవిత సత్యాలను పాటలో రాశారు. ఈ జనరేషన్ ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా చెప్పడానికి ప్రయత్నించాం. దర్శకుడు కౌశిక్ సర్.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి సార్ అని పిలవాల్సి వస్తుంది.. ఈ పాటకు నేనైతేనే న్యాయం చేస్తానని నమ్మినందుకు చాలా థాంక్స్. నిర్మాత బన్నీ వాసు గారు అలాగే హీరో కార్తికేయలతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన బన్నీగారు.. మనం కలిసి సినిమా చేయాలి సార్ త్వరగా.. ఈ పాట కోసం చాలా కష్టం మీద మీడియాతో మాట్లాడినప్పుడు చాలామంది.. పుష్ఫలో మీ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు.. సుక్కూసార్ మీరు వింటున్నారా?? నేను గుండె రాయి చేసుకుని నన్ను అడగలేదని చెప్పేశాను. రంగమ్మత్త చేసిన తరువాత వెయిట్ ఉన్న పాత్ర చేశానంటే అది ఈ సాంగ్‌నే. త్వరలో బన్నీతో కలసి చేయాలని ఆశపడుతున్నా’ అంటూ తన మనసులో కోరికను చావు కబురు చల్లగా ఈవెంట్ వేదికగా బన్నీ ముందు బయటపెట్టింది అనసూయ. అయితే అనసూయ అందరి ముందు అలా అడగడంతో బన్నీ ఓకే అన్నట్టుగా సైగలు చేసి నవ్వుతూ ఉండిపోయారు. చూడాలి మరి రంగమ్మత్త.. బన్నీ బాబుతో చిందేసేటందుకు ఎలాంటి ప్లాన్స్ వర్కౌట్ చేస్తుందో.. ఏ దర్శకుడు ముందుకు వస్తారో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2N1E7TD
v

No comments:

Post a Comment