Wednesday, 17 March 2021

ముగిసిన ‘సారంగ దరియా’ వివాదం: శేఖర్ కమ్ములను కలిసిన కోమలి.. ఎలాంటి అభ్యంతరం లేదు!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ‘లవ్ స్టోరి’ చిత్రంలో ‘సారంగ దరియా’ పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి ‘సారంగ దరియా’ పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. బుధవారం దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం కోమలి ఈ ప్రకటన చేసింది. గాయని కోమలి మాట్లాడుతూ.. ‘‘సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశాను. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొవరతో ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. సంతోషంగా ఉంది. ఆయన తన రాబోయే సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే ‘లవ్ స్టోరి’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద ‘సారంగ దరియా’ పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయాను. ఇవాళ ముఖాముఖి మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్‌లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తాను. నేను చేసిన ప్రామిస్‌లను నిలబెట్టుకుంటానని సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నాను’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38NIKrY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...