Thursday, 25 March 2021

సెన్సేషన్ అవుతున్న కంగనా- ఆర్జీవీ ట్వీట్స్.. తల పట్టుకుంటున్న నెటిజన్స్.. తనీష్ షాకింగ్ రియాక్షన్

ట్వీట్లను అర్థం చేసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. అలాంటి వర్మకు కూడా దిమ్మతిరిగే కౌంటర్లు వేయగల సత్తా ఉన్న నటి రనౌత్. అసలే ఈ ఇద్దరికి ఎప్పటి నుంచో కోల్డ్ వార్ జరుగోతోంది. కంగనా రనౌత్ అంటే.. వర్మకు అసలే నచ్చదు. ఆ మధ్య బాలీవుడ్ వ్యవహారాలపై కామెంట్ చేస్తూ కంగనాను ఏకిపారేశారు. సుశాంత్ సింగ్ మృతి, నెపోటిజం, బాలీవుడ్ మాఫియా, డ్రగ్స్ కేసు వంటి వ్యవహారాల్లో కంగనాకు వ్యతిరేకంగా వర్మ ట్వీట్లు వేసేవారు. అయితే కంగనా మాత్రం ఎప్పుడూ కూడా వర్మ ట్వీట్లను పట్టించుకునే వారు కాదు. కంగనా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లిపోయేవారు. కానీ వర్మ మాత్రం పదే పదే కంగనా చర్యలపై, కామెంట్లపై కౌంటర్లు వేస్తుండేవారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఈ ఇరువురు వేసుకున్న ట్వీట్లపై జనాల తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకున్నారా? లేదా తిట్టుకున్నారా? అన్న విషయం అర్థం కావడం లేదు. మొన్న కంగనా బర్త్ డే సందర్బంగా తలైవి ట్రైలర్‌ను విడుదల చేశారు. మాజీ సీఎం జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో కంగనా అద్భుతంగా నటించేశారు. జయలలిత పాత్రలో పూర్తిగా కంగనా ఒదిగిపోయారని అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ట్రైలర్ మీద, కంగనా వ్యక్తిత్వం మీద ఆర్జీవీ తన స్టైల్లో ట్వీట్లు వేశారు. దానికి అంతే స్థాయిలో కంగనా కౌంటర్లు వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతుండగా.. వాటిపై తనీష్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘హేయ్ కంగనా.. కొన్ని కొన్ని విషయాల్లో నేను నీతో ఏకిభవించకపోవచ్చు. కానీ తలైవీ ట్రైలర్‌లో సూపర్ డూపర్‌గా నటించావ్.. మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.. స్వర్గంలో ఉన్న జయలలిత కచ్చితంగా థ్రిల్ అయి ఉంటుంది' అని వర్మ ట్వీట్ వేశారు. దానికి ప్రతిగా.. ‘హేయ్ సర్.. కానీ నేను మీతో ఏ విషయంలోనూ ఏకిభవించకుండా లేను.. మీరంటే నాకు ఇష్టం.. మీమ్మల్ని ఎంతో ప్రశంసిస్తుంటాను. ఇలాంటి ఓ దరిద్రమైన ప్రపంచంలో మనిషికి ఉండే ఇగోలు, గర్వాలు ఊరికే హర్ట్ అవుతుంటాయి. కానీ అలాంటి వాటిని మీరు అసలు పట్టించుకోరు.. పైగా మీది మీరే పట్టించుకోరు.. తలైవిపై ప్రశంసలు కురిపించినందుకు థ్యాంక్స్’ అని కంగనా బదులిచ్చారు. ‘అవును నిజమే కంగనా.. ఎవరైనా తమ నిర్ణయాన్ని ధృడంగా చెబితే.. ఎదుటి వాళ్లను రెచ్చగొట్టినట్టు అవుతుంది. హాలీవుడ్ నటుల కంటే నువ్ ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నావ్.. ఇది నేను ఒప్పుకోవాల్సిందే. నీలాంటి ఓ విలక్షణ నటి ఈ ప్రపంచంలోనే లేదు.. ఇది నేను కచ్చితంగా అంగీకరిస్తాను.. నీకు క్షమాపణలు కూడా చెబుతున్నాను' అంటూ వర్మ మరో ట్వీట్ వేశారు. ఇక వీటిపై తనీష్ స్పందిస్తూ.. ‘అన్నింటికంటే ఎక్కువగా ఈ ట్వీట్లతోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను.. పొగడుతూ తిట్టుకుంటున్నారా? తిడుతూ పొగుడుకుంటున్నారా? అర్ధం కావట్లేదు’ అంటూ పోస్ట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3so6wm9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...