Monday, 8 March 2021

అనసూయ టాటూ సీక్రెట్స్.. అందుకే ఎదపై అలా! త్వరలో మరోటి అంటూ రహస్యం బయటపెట్టిన జబర్దస్త్ బ్యూటీ

ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోకి వస్తున్న అనసూయ.. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లోనూ హవా నడిపిస్తోంది. తన సబ్‌స్క్రైబర్స్ పెంచుకునేలా డిఫరెంట్ వీడియోస్ చేస్తూ పలు విషయాలపై ఓపెన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా '30 క్వశ్చన్స్ విత్ ' అనే స్పెషల్ వీడియో చేసి అన్ని ప్రశ్నలపై నేరుగా సమాధానాలిచ్చింది. ఇందులో భాగంగానే తన టాటూ సీక్రెట్స్ రివీల్ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ. అనసూయ ఎదపై ఒక టాటూ, అలాగే చేతి మీద మరో టాటూ ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ టాటూస్ ఫోకస్ అయ్యేలా పలు ఫోటోషూట్స్ కూడా చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆ టాటూల అర్థం చెప్పడమే గాక, ఏ సమయంలో వేయించుకున్నాననే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. అనసూయ ఎదపై ఉన్న టాటూలో ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ ముద్దుపేరు నిక్కు అని రాసి ఉంటుంది. అయితే ఆ టాటూ వేయించుకోవడానికి స్పెషల్ రీజన్ ఉందని అయసూయ అంటోంది. తామిద్దరం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాక సంవత్సరంన్నర తర్వాత పెళ్లి చేసుకున్నామని, దీంతో ఆ ఎంగేజ్‌మెంట్ యానివెర్సరీ డే సందర్భంగా అలా ఎదపై నిక్కు అనే టాటూ వేయించుకున్నానని అనసూయ తెలిపింది. ఇక చేతిపై ఉన్న టాటూ కేలర్ అని, దీని అర్థం 'బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యానికి విలువనివ్వడం' అని చెప్పింది. ఇక త్వరలో మరో టాటూ కూడా వేయించుకోబోతున్నట్లు అనసూయ వెల్లడించడం విశేషం. కెరీర్ పరంగా చూస్తే.. బుల్లితెర, వెండితెరలపై ఈ 'రంగమ్మత' జోరు మామూలుగా లేదనే చెప్పుకోవాలి. జబర్దస్త్‌తో పాటు పలు కార్యక్రమాలు హోస్ట్ చేస్తున్న ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్పెషల్ క్యారెక్టర్స్‌తో పాటు స్పెషల్ చేసే ఛాన్సులు దక్కించుకుంటూ హవా నడిపిస్తోంది అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3v3wcGv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...