Tuesday, 16 March 2021

బుమ్రా పెళ్లితో అనుపమ గుండె పగిలిందా..? అలా చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? వీడియో వైరల్

క్రికెటర్స్‌కి, సినిమా వాళ్లకి జనాల్లో ఉండే క్రేజే వేరు. అందుకే వీళ్ల గురించే ఎక్కువ రూమర్స్ పుడుతుంటాయి. వీళ్ల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక క్రికెటర్స్, సినిమా హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్స్ అయితే ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బ్యూటీ , యువ క్రికెటర్ విషయంలో అదే జరుగుతోంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ పెద్దఎత్తున వార్తలు షికారు చేశాయి. అనుమప పరమేశ్వరన్- బుమ్రా పెళ్లికి ముహూర్తం కూడా కుదిరిందని, త్వరలో గుజరాత్‌లో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా వ్యాపించాయి. అనంతరం ఈ వార్తల్లో నిజం లేదని అనుపమ తల్లి క్లారిటీ ఇవ్వడం, ఇంతలో వేరే అమ్మాయితో జరగడం చకచకా జరిగిపోయాయి. మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ సంజన గణేశన్‌‌ని బుమ్రా పెళ్లాడారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతవరకూ బాగానే ఉన్నా బుమ్రా పెళ్లి జరిగిన మరుసటి రోజే హీరోయిన్ అనుమప పరమేశ్వరన్ ఇలా విరహ గీతం పాడి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడం కొత్త చర్చలకు తెరలేపింది. గతంలో బుమ్రా- అనుపమ డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్ తలెత్తగా.. లేదు లేదు బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి రేలేషన్‌షిప్ లేదని పేర్కొన్న అనుపమ, ఇప్పటికిప్పుడు బుమ్రా పెళ్లి కాగానే ఇలా విరహ గీతం పాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పుకుంటున్నారు జనం. ఈ వీడియో చూసిన నెటిజన్స్ 'బుమ్రా పెళ్లితో అనుపమ గుండె పగిలిందా?' అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bTtfRs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...