ప్రముఖ తమిళ దర్శకుడు (61) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వారం రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 7 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఎస్పీ జనంథాన్ మరణ వార్త తెలిసి శృతి హాసన్, విజయ్ సేతుపతి, జయం రవి సహా తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న జనంథాన్ ప్రాణాలు కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నించాం కానీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, వైద్యం అందిస్తుండగానే గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. 2003 సంవత్సరంలో 'ఇయార్కై' సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఎస్పీ జనంథాన్.. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు పొందారు. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ సాధించిన ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతి, శృతిహాసన్‌తో 'లాభం' మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగానే ఆయన కన్నుమూయడం చిత్ర యూనిట్‌ని విషాదంలో ముంచెత్తింది. 'లవ్ యూ సార్..' అంటూ అయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు విజయ్ సేతుపతి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q5tTTv
v
No comments:
Post a Comment