Saturday, 6 March 2021

ముంత కల్లు మజాలో సింగర్ సునీత.. పక్కనే మరో యాంకరమ్మ.. రిసార్ట్‌లో అలా!!

ఇటీవలే మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒకరకంగా ఆమెకు సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్న ఆమె ఇటీవలే భర్తతో కలిసి భూతల స్వర్గంగా చెప్పుకునే మాల్దీవ్స్ కూడా వెళ్లొచ్చింది. ఆ తర్వాత తన ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆమె తాజాగా ఓ రిసార్ట్‌లో కల్లు గ్లాస్ చేతిలో పట్టుకొని కనిపించడంతో ఈ ఫొటో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఈ ఫొటో గమనించినట్లయితే.. ఏకంగా ముంత కల్లుతో కనిపించి ఫొటోకు నవ్వుతూ స్టిల్ ఇచ్చింది సునీత. పక్కనే కల్లుగీత కార్మికుడు కూడా ఉన్నాడు. అంతేకాదు ఆమెతో పాటు యాంక‌ర్ గాయ‌త్రి భార్గ‌వి కూడా కనిపించింది. అయితే సునీత కల్లు తాగిందో లేదో తెలియదు గాని ఇంటర్నెట్‌లో మాత్రం ఈ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసి సునీత జస్ట్ కల్లు‌ గ్లాసుతో ఫొటోకు పోజిస్తుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. కాదు కాదు, కల్లు రుచి చూసే ఉంటుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. s అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రగతి రిసార్టులో ఓ స్పెషల్ ప్రోగ్రాం కోసం సునీతతో పాటు మరికొందరు సెలబ్రిటీలు వెళ్లారు. అక్కడే ఇలా కల్లు గ్లాసు పట్టుకొని కెమెరాకు ఫోజులిచ్చారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇంకేముంది సునీత కల్లు తాగేస్తోందంటూ సోషల్‌ మీడియాలో రచ్చ మొదలైంది. ఏదేమైనా ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ లేనంతగా ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సునీత హంగామా చేస్తుండటం విశేషమే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eeOkaw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...