Saturday, 27 March 2021

అలా చేస్తే మగతనం మటాష్.. దాని సైజు కూడా తగ్గిపోద్ది.. హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్

రోజు రోజుకూ పెరగడం, పర్యావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇందువల్ల చోటు చేసుకునే దుష్ఫలితాలు నేరుగా మనుషులపై, ఈ భూమిపై నివసించే ఇతర జంతువులపై పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలుష్యం కారణంగా పర్యావరణ ముప్పును తెలుపుతూ దాని వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ ‘స్కై న్యూస్’లో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఇది చూసిన హీరోయిన్ దాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వాతావరణంలో నానాటికీ పెరుగుతున్న కాలుష్య ప్రభావంతో మనుషుల పురుషాంగం సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటూ స్కై న్యూస్ ఆర్టికల్ తెలిపింది. దీంతో పర్యావరణం పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టే హైదరాబాదీ బ్యూటీ దియా మీర్జా వెంటనే అలర్ట్ అయి ఆ ఆర్టికల్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరితో పంచుకుంది. ఈ మేరకు ఇకనైనా ఈ అంశాన్ని ప్రపంచం సీరియస్‌గా తీసుకోవాలని, లేదంటే మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది అన్నట్లుగా మెసేజ్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. పర్యావరణ పరిరక్షణపై స్పెషల్ కేర్ తీసుకునే దియా మీర్జా.. గత నెలలోనే వైభవ్ రేఖీ అనే బిజినెస్‌మెన్‌ని పెళ్లాడింది. తన వివాహ వేడుకను కూడా పర్యావరణహితంగా అత్యంత జాగ్రత్తలు తీసుకొని నిర్వహించుకుంది. 'రహ్నా హై తేరే దిల్ మే' సినిమాతో సినీ గడపతొక్కి బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన దియా.. మరికొద్ది రోజుల్లో నాగార్జున హీరోగా రూపొందిన 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమాలో దియా రోల్ చాలా కీలకం అని టాక్. ఏప్రిల్ 2వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d8050k
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...