Wednesday, 17 March 2021

ఎవరు మీలో కోటీశ్వరులు: ఎన్టీఆర్‌కు భారీ రెమ్యునరేషన్.. ఎంతంటే!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై మెరవబోతున్న విషయం తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో విడుదలైంది. ఇటీవల ఎన్టీఆర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మే మొదటి వారం నుంచి ఈ షో ప్రసారమవుతుందని అనుకుంటున్నారు. బిగ్ బాస్ షోను సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసిన తరవాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే, ఈ రియాలిటీ షోకు వ్యా్ఖ్యాతగా వ్యవహరించడానికి ఎన్టీఆర్ పారితోషికం ఎంత తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోను హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ రూ. 10 కోట్లు తీసుకుంటున్నారని టాక్. సన్ నెట్‌వర్క్‌తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎన్టీఆర్ కనీసం 50 ఎపిసోడ్‌లు హోస్ట్ చేయాల్సి ఉంటుందట. గరిష్టంగా 60 ఎపిసోడ్లు ఉంటాయని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌కు ఉన్నంత వాక్చాతుర్యం ప్రస్తుత యంగ్ హీరోలెవరికీ లేదంటే అతిశయోక్తికాదు. అంత బాగా ఆయన సందర్భానుసారంగా మాట్లాడగలరు. ఆయన వాక్చాతుర్యం, కమాండింగ్ పవర్ ఎలా ఉంటుందో ఇప్పటికే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’లో మనం చూశాం. టెన్షన్‌తో సాగే ఈ రియాలిటీ షోను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఆసక్తికరం. ఎన్టీఆర్ తనకున్న బలాలతో కచ్చితంగా సామాన్యుడికి కనెక్ట్ అయిపోతారనేది అందరి మాట. అందుకే జెమిని టీవీ యాజమాన్యం కూడా ఆయనపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంది. ప్రతి వారాంతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్స్ షూట్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. అలాగే, మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OyBnxV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...