Monday, 8 March 2021

లక్కీ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ.. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక

టాలెంట్ నీ సొంతమైతే ప్రపంచం నీ వెంటే ఉంటుంది అని నిరూపించేలా బంపర్ ఆఫర్ కొట్టేసింది . యూట్యూబ్‌ ఛానల్ 'దేత్తడి' ద్వారా జనాల్లో గుర్తింపు తెచ్చుకొని బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఫుల్ పాపులర్ అయిన ఈ బ్యూటీని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ () బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది తెలంగాణ గవర్నమెంట్. నిన్న (సోమవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా చేతుల మీదుగా TSTDC బ్రాండ్ అంబాసిడర్‌గా నియామక పత్రాన్ని అందుకుంది హారిక. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ అక్కడి ఫొటోలు షేర్ చేశారు. ఇవి చూసి హారికకు కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ యాసతో యూట్యూబ్‌ ద్వారా ఫాలోయింగ్ పెంచుకున్న దేత్తడి హారిక.. బిగ్‌బాస్‌లోకి వెళ్లి మ‌రింత క్రేజ్‌ కొట్టేసింది. ఫైనల్ వరకూ హౌస్ లోనే ఉండి టాప్ 5 వ‌ర‌కు వెళ్లిన ఈ బ్యూటీ త‌న ఆట్యిట్యూడ్‌తో ఆడియన్స్‌ని మెప్పించింది. కాగా, ఇప్పుడు తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్‌‌గా సినిమాలు చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా తన మనసులో మాట బయటపెట్టింది హారిక. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలనుందని ఆమె తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qD19Ox
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...