Friday, 5 March 2021

ఇష్క్ ఫస్ట్‌ లుక్: యువ హీరో గుండె ముక్కలు చేసేసిన ప్రియా ప్రకాష్

కన్నుగీటి కుర్రకారును వలలో వేసుకున్న వారియర్ ఇటీవలే 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతోంది ప్రియా. బాల నటుడిగా సుపరితమైన హీరోగా రూపొందుతున్న '' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్న యూనిట్ తాజాగా 'ఇష్క్' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన జాంబీ రెడ్డి సినిమాతో తేజ సజ్జా హీరోగా ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. జాంబీల నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో తేజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు త‌న రెండో సినిమాగా ఈ ఇష్క్ మూవీ చేస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అంటూ చాలా డిఫరెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రియా రోల్ కీలకం అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రకారం చూస్తే తేజ సీరియస్‌గా, ప్రియా స్మైలీ ఫేస్‌తో కనిపిస్తోంది. అంటే ప్రేమ పేరుతో కుర్రాడి గుండె ముక్కలు చేయడం ఈ మూవీ కాన్సెప్టా? అనే సందేహం కలుగుతోంది. ఎస్ఎస్ రాజు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ 'ఇష్క్' మూవీ రూపొందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అతిత్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30iVvWI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...