Tuesday, 2 March 2021

అభిరామ్ ఎంట్రీ కోసం దగ్గుబాటి వారి స్కెచ్.. టాలెంటెడ్ డైరెక్టర్‌తో సురేష్ బాబు పక్కా ప్లాన్!

సినీ ఇండస్ట్రీ అన్నాక వారసుల ఎంట్రీ అనేది కామన్. ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ స్టార్ కిడ్స్ తెరంగేట్రం చేయడం సాధారణమే. బడా దర్శకనిర్మాతలు, స్టార్ హీరోల తనయులు వెండితెరపై కాలుమోపడం చూస్తున్నాం. అయితే ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేనిదే కెమెరా ముందు ఎక్కువకాలం నిలవలేరు అనేది మాత్రం వాస్తవం. ఈ క్రమంలోనే రానా సోదరుడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ ఎంట్రీ కోసం పక్కాగా స్కెచ్చేసిందట దగ్గుబాటి ఫ్యామిలీ. టాలెంటెడ్ దర్శకుడి చేతిలో పడితేనే అభిరామ్ లోని నటనను వెలికితీస్తాడని భావించిన సురేష్ బాబు.. అందుకోసం చాలా మంది దర్శకులను పరిశీలించారట. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా సినీ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. అయితే రీసెంట్‌గా డైరెక్టర్ రవిబాబుతో చర్చలు జరిపిన సురేష్ బాబు.. అభిరామ్ ఎంట్రీ ఫిక్స్ చేశారని సమాచారం. దర్శకుడిగా తనదైన బ్రాండ్‌ని, ట్రెండ్‌ని సృష్టించుకున్న రవిబాబుతో పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగుతున్నారట. ఇకపోతే ఈ సినిమాను సర్వ హంగులతో భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించబోతున్నారట సురేష్ బాబు. రామానాయుడు కుటుంబం నుంచి వచ్చిన వెంకటేష్, రానా వారికాంటూ ఓ స్పెషల్ మార్కెట్ సెట్ చేసుకున్నారు కాబట్టి వారి బాటలోనే అభిరామ్ వెళ్లాలని కోరుకుంటున్న సురేష్ బాబు.. ఇందుకోసం ప్రత్యేకమైన సమయం కేటాయించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. చూడాలి మరి చిన్న కుమారుడి కోసం సురేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర సక్సెస్ అవుతాయనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uP2xAH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...