Sunday, 14 March 2021

అవార్డుల ఫంక్షన్‌లో సీనియర్ నటి న్యూడ్ షో.. అందరి ముందే దుస్తులు ఊడదీసి నగ్నంగా! నోరెళ్లబెట్టిన యాక్టర్స్

కొన్ని సందర్భాల్లో పబ్లిక్‌లో జరిగే ఊహించని ఘటనలు సడెన్ షాకిస్తుంటాయి. అందరూ చూస్తుండగానే అనుకోని విధంగా కొందరు చేసే చేష్టలు ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వింత ఘటన ప్రపంచాన్నే షాక్‌‌కి గురి చేసింది. సినిమా అవార్డుల ఫంక్షన్‌లో ఓ సీనియర్ నటి అందరూ చూస్తుండగానే తన ఒంటిపై ఉన్న దుస్తులు ఊడదీయడంతో ఒక్కసారిగా అంతా నోరెళ్లబెట్టారు. అక్కడున్న సినీ నటులు ఆశ్చర్య పోవడం తప్ప మరేమీ చేయలేక పోయారు. ఫ్రాన్స్ నగరంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన సీజర్ అవార్డుల వేడుకలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్ పైకి వచ్చి అందరూ చూస్తుండగా బట్టలను విప్పేసింది నటి . నగ్నంగానే వేదికపై మాట్లాడి వార్తల్లో నిలిచింది. 57 ఏళ్ల ఈ యువతి ఓ నిరసన తెలపడానికి ఇలా ప్రవర్తించిందని సమాచారం. ఆమె వీపుపై నిరసనకు గల కారణాన్ని కూడా తెలిపింది. ప్యారిస్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధంగా ఆమె నిరసన వ్యక్తం చేసింది. అందమైన క్యాస్టూమ్స్‌తో వేదిక మీదకు వచ్చిన కోరెన్ మాసిరో.. ఒక్కసారిగా దుస్తులన్నీ విప్పేసి న్యూడ్‌గా దర్శనమివ్వడంతో ఏ ఒక్కరి నోటివెంట మాట రాలేదు. ఓ రెండు నిమిషాల పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేదు అక్కడి జనాలు. 'కల్చర్ లేకపోతే ఫ్యూచర్ లేదని' తన చెస్ట్‌పై రాసుకున్న ఆమె, వీపు భాగంలో ‘మాకు మా కళను అప్పగించండి. బతికించండి' అని రాసుకుంది. కరోనా వైరస్ కారణంగా గవర్నమెంట్ గత ఎడాది నుంచి థియేటర్లు, సినిమాహాళ్లను మూసివేయించిందని ఆరోపణలు చేస్తూ ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్‌ను ఉద్దేశించి కోరెన్ ఈ నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. అందరి ముందే న్యూడ్ షో ఇవ్వడంతో ప్రస్తుతం కోరెన్ మాసిరో పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NfPXJQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...