Saturday, 6 March 2021

మారుతీ దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' షూటింగ్ స్టార్ట్.. డిఫరెంట్ రోల్‌లో గోపీచంద్

'ప్ర‌తిరోజు పండ‌గే' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు చేయ‌బోయే సినిమాపై సర్వత్రా ఆస‌క్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవ‌లే మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో హీరోగా '' సినిమాను అనౌన్స్ చేశారు డైరెక్టర్ మారుతి. ఈ టైటిల్‌కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలతో పాటు ఇటు జనరల్ పబ్లిక్ నుంచి మంచి స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌న ల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ చిత్ర విడుదల తేదీని వినూత్నంగా ప్ర‌క‌టించ‌డం కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్‌లో మొదలైంది. ఈ సినిమాతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్, బ‌న్నీవాసు, మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ 'పక్కా కమర్షియల్' అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది, ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌కేఎన్ సహ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని, ఇతర వివరాలను త్వ‌ర‌లోనే వెల్లడించనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sVljVj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...