Sunday, 14 March 2021

'జాతిరత్నాలు' బ్యూటీకి బంపర్ ఆఫర్.. మాస్ మహారాజ్ రవితేజతో రొమాన్స్ చేసే ఛాన్స్!

ఒక్కోసారి చిన్న సినిమాలే భారీ సక్సెస్ అందుకొని అందులో భాగమైన నటీనటులకు మంచి లైఫ్ ఇస్తుంటాయి. గతంలో ''పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, Rx100'' లాంటి సినిమాలు ఈ కోవకే చెందినవి కాగా ఇప్పుడు ఆ లిస్టులో 'జాతిరత్నాలు' మూవీ కూడా చేరిపోయింది. మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి వసూళ్ల ప్రవాహం పారిస్తోంది. చిత్రంలో నటించిన నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి ఆడియన్స్‌తో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. నటనలో పరిణితి కనబర్చుతూ నవీన్ పోలిశెట్టి భేష్ అనిపించుకోగా.. ఆయన సరసన చిట్టిగా హీరోయిన్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో ఈవిడేంటి ఇంత పొడవుంది అని ప్రభాస్ చేసిన ఒక్క కామెంట్‌తో 'ఫరియా అబ్దుల్లా'కి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ వచ్చింది. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే పడింది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా బంపర్ ఆఫర్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' మూవీ చేస్తున్న రవితేజ.. తన తర్వాతి సినిమాను త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్‌గా తీసుకుంటే బెటర్ అని దర్శకనిర్మాతలతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన సూచన మేరకు దర్శకనిర్మాతలు కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అతి త్వరలో దీనిపై అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే ఫరియా అబ్దుల్లా కెరీర్‌కి ఇది సూపర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qKrBFF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...