Saturday, 13 March 2021

అందుకే మూడేళ్లుగా దూరమయ్యా.. కారణం అదొక్కటే..! అసలు విషయం బయటపెట్టిన ఎన్టీఆర్

నందమూరి నట వారసుడిగా కెమెరా ముందుకొచ్చినా.. వెండితెరపై తనదంటూ ప్రత్యేకమైన స్టైల్ అని నిరూపించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అనతికాలంలోనే స్టార్‌డమ్ సంపాదించిన ఆయన, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరుగా ఉన్నారు. ఇక యంగ్ టైగర్ అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? కోట్లాది మంది ఫ్యాన్స్ తారక్ పేరు వినగానే హుషారెత్తిపోతారు. మరి అలాంటి హీరోకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎలాగూ ఓ రేంజ్‌లో ఉంటుంది కదండీ. అదే విషయంలోనూ జరిగింది. కాగా సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న ఆయన.. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ వేదికలపై చురుకుగా ఉండటం లేదు. అయితే తాజాగా అందుకు కారణం వెల్లడించారు ఎన్టీఆర్. మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతున్న బుల్లితెర షో '' ప్రోమోను రిలీజ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. తన కెరీర్, వ్యక్తిగత విషయాలెన్నో పంచుకున్నారు. అరవింద సమేత మూవీ తర్వాత మరే సినిమాలోనూ కనిపించని ఎన్టీఆర్.. సోషల్ మీడియాలోనూ హవా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, తనకు సోషల్ మీడియాతో పెద్దగా అనుబంధం ఉండదని చెబుతూ ఓపెన్ అయ్యారు. ఒక రకమైన ప్రపంచంలో ఉండటం తన వల్ల కాదని, తనకు అలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదని అన్నారు ఎన్టీఆర్. కాకపోతే తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, టీమ్ తన ఫాన్స్ గురించిన అప్‌డేట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మూడేళ్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో కనిపించడం లేదంటే దానికి కారణం సినిమా అని అసలు విషయం బయటపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం వల్ల ఏదో మిస్ అవుతున్నానే ఫీలింగ్ అయితే లేదని, తన ఇద్దరు పిల్లలతో ఎప్పుడూ బిజీగా, ఆనందంగా ఉంటున్నానని చెప్పారు. అదేవిధంగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉందని ఎన్టీఆర్ తెలపడం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38A5VGm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...