Saturday, 13 March 2021

Aamani: నా గురించి అల్లు అర్జున్ మాటలు ఆ ఫీలింగ్స్ తెప్పించాయి.. సీనియర్ నటి ఆమని ఓపెన్ కామెంట్స్

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కి సూపర్ ఫేవరేట్ ఆమని. వెండితెరపై ఓ భర్యగా నిజ జీవితాన్ని ప్రతిబింబించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. వైఫ్ అంటే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా కెరీర్ కొనసాగించి భారీ విజయాలందుకున్న ఆమని.. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగా కార్తికేయ హీరోగా రాబోతున్న 'చావు కబురు చల్లగా' సినిమాలో 'గంగమ్మ'గా ఆమని కీలకపాత్ర పోషించారు. అయితే మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో తన రోల్ చూసిన , సుకుమార్.. ''చాలా అద్భుతంగా చేశారమ్మా'' అనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమని తెలిపారు. 'చావు కబురు చల్లగా' అవుట్‌పుట్ చూశాక గంగమ్మగా మీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు మంచి బ్రేక్‌ అవుతుంది అని బన్నీ, సుకుమార్ ఇద్దరూ పేర్కొనడం తనకు అవార్డ్‌ అందుకున్నంత ఆనందం కలిగించిందని ఆమని అన్నారు. ఎలాంటి సపోర్ట్‌ లేని ఓ తల్లి తన ఇష్టాఇష్టాలను చంపుకొని బిడ్డను ప్రయోజకుడిని చేయడానికి ఎంత కష్టపడింది. ఆమెను కొడుకు ఎలా అర్థం చేసుకున్నాడు అనేదే ఈ సినిమాలో తన పాత్ర ఇతివృత్తం అని తెలిపిన ఆమని.. ఇటీవల తాను చేసిన పాత్రల్లో ఇది చాలా డిఫరెంట్‌ అని చెప్పారు. ఇటీవలే విడుదలైన తన లుక్‌కి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2 బ్యానర్‌పై ఈ 'చావు కబురు చల్లగా' సినిమా రూపొందించారు. మర్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించగా.. అనసూయ ఐటెం సాంగ్ చేసింది. ఆమని కీలకపాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q5aZfv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...