2019 నవంబర్ 3 .. ఇసుక కొరత కారణంగా నాలుగు నెలలుగా సమస్యలు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు అప్పట్లో.. వివిధ జిల్లాల నుంచి జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జనసైనికుల్లో ఉత్సాహం నింపుతూ పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన ప్రసంగం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రంలో జగన్ పాలన బాగుంటే తాను సినిమాలు చేసుకుంటాని.. జగన్ పాలనలో చోటుచేసుకుంటున్న వైఫల్యాల వల్లనేను ప్రజల మధ్యకు రావలసి వస్తుందన్నారు పవన్ కళ్యాణ్. తాను టీడీపీ బీ టీంగా వైసీపీ విమర్శలు చేస్తుందని.. తాను ప్రజలకు మాత్రమే బీ టీంగా ఉన్నానన్నారు. భీమవరం, గాజువాకలో ఓడిపోయినంత మాత్రం విఫలమైనట్లుగా కాదన్న పవన్.. తనకి దక్కుతున్న ఆదరణ కంటే పదవులు పెద్ద లెక్కేం కాదని చెప్పారు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడెందుకు చర్చ అంటే.. పవన్ కళ్యాణ్ తాజాగా ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు.. ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఇవే కాకుండా.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళ రీమేక్ మూవీ చేస్తున్నారు. రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు పవన్. ఇక మెగా దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫామ్ అయ్యింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ వరుసగా ఐదు సినిమాలకు ఓకే చేశారు. ఈ తరుణంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి గతంలో పవన్ కళ్యాణ్.. జగన్‌ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘జగన్ అధికారంలోకి వచ్చాక అనౌన్స్ అయిన 5వ సినిమా ‘హరి హర వీరమల్లు’.. జగన్‌కి అభినందలు’ అంటూ గతంలో జగన్‌పై పవన్ చేసిన కామెంట్‌ను పోస్ట్ చేశారు. ‘జగన్ పాలన బాగుంటే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటాను’ అని పవన్ అప్పట్లో చేసిన కామెంట్లను షేర్ చేశారు కత్తి మహేష్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tc1x87
v
No comments:
Post a Comment