Wednesday, 10 March 2021

20 సంవత్సరాల తరవాత ‘గాలి సంపత్’ను నేనే రీమేక్ చేస్తా: శ్రీ విష్ణు

‘అప్పట్లో ఒక‌డుండేవాడు’, ‘నీది నాది ఒకే క‌థ‌’, ‘మెంట‌ల్ మ‌దిలో..’, ‘బ్రోచేవారెవ‌రురా’ వంటి చిత్రాల‌తో తెలుగు సినీ ప‌రిశ్రమ‌లో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో న‌టించిన చిత్రం ‘గాలి సంప‌త్’. బ్లాక్‌బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే అందించి, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేసిన ఈ చిత్రంలో ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ విష్ణు ఇంట‌ర్వ్యూ.. ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది? అనిల్ రావిపూడి గారు ఫోన్ చేసి ‘ఒకసారి నిన్ను క‌ల‌వాలి’ అని అన్నారు. అలాగే సాహూ గారు, హ‌రీష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. వాళ్లు ఫోన్ చేసి ఇలా క‌థ చెప్తారంట అన‌గానే ఆయ‌నేంటి నాకు క‌థ చెప్పడం ఏంటి.. ఆయ‌న‌వ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. నేను కొత్త డైరెక్టర్స్‌తో డిఫ‌రెంట్ సినిమాలు చేస్తున్నాను. దాంతో పాటు ఇంత‌కు ముందు నా రెండు మూడు సినిమాల‌కి అనిల్ రావిపూడి గారు వ‌చ్చి స‌పోర్ట్ చేశారు. మా ఈవెంట్‌కి వ‌చ్చి మాకు ఎన‌ర్జీ ఇచ్చి వెళ్లేవారు. ఆయ‌నంటే నాకు గౌర‌వం. స‌రే రమ్మన్నారు క‌దా అని వెళ్లాను. ఈ సినిమా పాయింట్ చెప్పారు. ‘ఎలా ఉంది.. నీకు న‌చ్చితే చేద్దాం’ అన్నారు. చాలా బాగుంది.. నేను రెడీ అని చెప్పాను. త‌ర్వాత డైరెక్టర్‌, టెక్నీషియ‌న్స్ ని సెట్ చేసి చెప్తాను అని చెప్పారు. ఫాద‌ర్ క్యారెక్టర్ ఎవ‌రు చేస్తున్నారు అని అడ‌గ‌గానే రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది అని ఒక ఐడియా వ‌చ్చేసింది. ఈ సినిమా మీ క‌థా, మీ ఫాద‌ర్ క‌థా? ఎవ‌రో ఒక‌రిది అని కాదు. ఈ స్టోరీలోనే నేను, ఫాద‌ర్ ఇద్దరం కుదిరాం. సెట్లో రాజేంద్ర ప్రసాద్, మీ మధ్య డిస్కషన్స్ ఎలా ఉండేవి? నేను ఒకసారి రెడీ అయ్యి షూటింగ్ అట్మాస్పియ‌ర్‌లోకి ఎంట‌ర్ అయ్యాక నా ప‌ని నేను చేసుకుంటాను. షూటింగ్ ఎక్కువ భాగం ఔట్‌డోర్‌లో జ‌ర‌గ‌డం వ‌ల్ల బ్రేక్‌లో రాజేంద్ర ప్రసాద్ గారి ద‌గ్గరి నుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునేవాడిని. ఆయ‌నా చాలా బాగా చెప్పేవారు. 90వ ద‌శ‌కంలో ఒకే సంవ‌త్సరం 12 సినిమాలు చేశారు. అందులో 8 సినిమాలు వంద‌ రోజులు ఆడాయ‌ని చెప్పారు. అన్ని పాత్రలు ఎలా సెల‌క్ట్ చేసుకునేవారు, ఎలా చేసేవారు? ఇలాంటి ప్రశ్నలు ఆయ‌న్ని అడిగిన‌ప్పుడు చాలా గొప్పగా స‌మాధానాలు చెప్పేవారు. ఆయ‌న‌ని క‌లిసిన త‌ర్వాత డిఫ‌రెంట్ క‌థ‌లు ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి అనే దానికి చాలా హెల్ప్ అయ్యింది. ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి ఇన్‌పుట్స్ తీసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. చాలా ఈజీగా చేయ‌గ‌లిగాను. దాదాపు ప్రతి షాట్ సింగిల్ టేక్‌లోనే చేశాను. సంగీత ద‌ర్శకుడిగా అచ్చు రాజ‌మ‌ణిని ఎంచుకోవ‌డానికి రీజ‌నేంటి? అచ్చు తమిళ్‌లో ఒక పాట చేశాడు. అది నాకు ప‌ర్సన‌ల్‌గా బాగా న‌చ్చింది. ఈ టీమ్ కూడా విని బాగుంది అన్నారు. ఆయ‌న్ని మ్యూజిక్ డైరెక్టర్‌గా పెడ‌దాం లేదా ఆ పాటను అలాగే పెడ‌దాం అని వారికి చెప్పాను. వారు స‌రే మ్యూజిక్ అచ్చుతోనే చేపిద్దాం అన్నారు. అలా అచ్చుని సంగీత ద‌ర్శకుడిగా తీసుకున్నాం. ఆ పాట‌తో పాటు ఈ సినిమాలో ఫాద‌ర్ ఎమోష‌న్స్‌తో వచ్చే ఫీఫీఫీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది. తండ్రీకొడుకుల క‌థ‌లో ఒక అమ్మాయికి ఎంత స్కోప్ ఉంటుంది? ఈ సినిమాలో కోర్ ఎమోష‌న్ మాత్రమే ఫాద‌ర్ అండ్ స‌న్ మీద ఉంటుంది. మిగ‌తా పార్ట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ల‌వ్‌లీ సింగ్ కొత్త అమ్మాయి. చాలా బాగా చేసింది. త‌న క్యారెక్టరైజేష‌న్ త‌ప్పకుండా ఆడియ‌న్స్‌కి న‌చ్చుతుంది. రియ‌ల్ లైఫ్‌లో మీ పేరెంట్స్‌తో ఎలా ఉంటారు? ఇప్పటి వ‌ర‌కూ నేను ఏ ప‌ని చేసినా ఎప్పుడూ క్వశ్చన్ చేయ‌లేదు. నేను ప్రతీది వారికి చెప్పే చేస్తాను. చిన్నప్పటి నుంచీ నువ్వు అది చేయి ఇది చేయి అని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. నా మీద న‌మ్మకం ఉంది. అందుకే మ‌న ఇంట్లో ఉండే ఎమోష‌న్స్ ఎక్కువ ఉన్న సినిమాలే నేను ఎక్కువ‌గా చేస్తూ వ‌చ్చాను. దానికి మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఎక్కువ క‌నెక్ట్ అయి ఉండ‌డం కూడా ఓ కార‌ణమేమో. కొత్త వాళ్లు ఎక్కువగా ఉండడం వ‌ల్ల లాంగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ప్లాన్ చేశారు. టీమ్ అంద‌రం అర‌కు వెళ్లి 30 రోజులు అక్కడే షూట్ చేశారు. ఇంటీరియ‌ర్ వరకు హైద‌రాబాద్‌లో తెర‌కెక్కించాం. ఈ సినిమా అంతా ముందే ప్రాప‌ర్‌గా ప్లాన్ చేయ‌డం వ‌ల్ల షూటింగ్ స‌ర‌దాగా జ‌రిగింది. మా మ‌ధ్య డిస్కషన్స్ చాలా హెల్తీగా ఉండేవి. మంచి ర‌న్‌టైమ్‌.. ఆడియ‌న్స్‌కి కూడా ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ ఉండ‌దు. ఫ్యామిలీస్‌కి చిన్న పిల్లల‌కి ఇంకా ఎక్కువ‌గా న‌చ్చుతుంది. మంచి క‌థ‌ల‌ను మీరు సెల‌క్ట్ చేసుకుంటున్నారా? లేదంటే మీ కోస‌మే మంచి క‌థ‌లు రాస్తున్నారా? ఇది వ‌ర‌కు నేను క‌థ‌ల కోసం ప‌రిగెత్తే వాడిని.. ఇప్పుడు మంచి మంచి క‌థ‌లు నా ద‌గ్గర‌కి వ‌స్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఈ క‌థ అనిల్ కాకుండా వేరే డైరెక్టర్ వ‌చ్చి చెప్పుంటే సినిమా చేసేవారా? నిజానికి నేను అనిల్ రావిపూడి గారి జోన‌ర్‌కి వెళ్లడం కాదండీ.. ఆయ‌నే నా జోన‌ర్‌కి వ‌చ్చి త‌యారు చేసిన క‌థ‌ ఇది. నాకు సెట్ అయ్యే క‌థే.. కాబ‌ట్టి డెఫినెట్‌గా చేసేవాడిని. అలాగే ఈ సినిమా చాలా మంది వేరే భాష‌ల్లో రీమేక్ చేస్తార‌ని అనుకుంటున్నాను. ఒక వేళ నాకు అవ‌కాశం ఉంటే మ‌రో 20 సంవ‌త్సరాల త‌ర్వాత రాజేంద్ర ప్రసాద్‌ గారి పాత్ర నేనే పోషించి ఈ సినిమా రీమేక్ చేస్తాను. త‌దుప‌రి చిత్రాల గురించి? ప్రస్తుతం ‘రాజ‌రాజ‌చోర’ సినిమా విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ‘అర్జున‌ ఫ‌ల్గున’ సినిమా 60 శాతం షూట్ కంప్లీట్ అయింది. త‌ర్వాత ఒక కొత్త ద‌ర్శకుడితో కాప్ బ‌యోపిక్ (పోలీస్ ఆఫీస‌ర్ బ‌యోపిక్‌) చేస్తున్నాను. అలా‌గే నా ఫ‌స్ట్ మూవీ ‘బాణం’ డైరెక్టర్‌తో మ‌రో మూవీ చేస్తున్నాను. ఈ ఏడాది క‌చ్చితంగా మూడు సినిమాలు విడుద‌ల‌వుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Nb4HtC
v

No comments:

Post a Comment