Thursday, 25 February 2021

Virata Parvam : మనసుకు హత్తుకునే మెలోడీతో మరోసారి 'ఫిదా' చేసిన సాయి పల్లవి

నాచురల్ అందం, అంతకుమించి అన్నట్లుగా నాచురల్ స్టెప్పులతో ఫిదా చేయడంతో సాయి పల్లవిని మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. 'ఫిదా' మూవీ, ఈ సినిమాలోని పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది.. తాజాగా '' నుంచి మరో పాటతో ఫిదా చేసేసింది. నాచురల్ లొకేషన్స్‌లో బ్యూటిఫుల్‌గా చిత్రీకరించిన ఈ పాటను కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు విక్టరీ వెంకటేష్. ''కోలు కోలుమ్మా.. కోలు కోలు నా సామి.. మనసే మేలు కొని చూసే.. కలలో నిండిన వాడే.. కనుల ముందుట ఉంటే నూరేళ్లు నిదుర రాదులే'' అంటూ మనసుకు హత్తుకుంటోంది ఈ సాంగ్. లంగా వోణిలో లుక్స్ యూత్ ఆడియన్స్‌ని యమ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. దివ్య మాలికా ఆలపించారు. సురేశ్‌ బొబ్బిలి బాణీలు కట్టారు. రానా, సాయి ప‌ల్లవి జంట‌గా డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ 'విరాటపర్వం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో 'రెవ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌‌తో మూవీ రూపొందిస్తున్నారు. వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి రోల్ ఈ సినిమాకు కీలకం కానుందట. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aSQzOH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...