Thursday, 11 February 2021

RRR ఫినిష్ కాగానే రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఇదే! ఎగిరి గంతేస్తున్న మెగా ఫ్యాన్స్.. నేషనల్ వైడ్ ట్రెండ్

'రంగస్థలం' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ ప్రస్తుతం మూవీతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్లైమాక్స్‌ పార్ట్ షూట్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే రామ్ చరణ్‌ను వదిలేయనున్నారట. దీంతో అందరి కళ్ళు చెర్రీ తదుపరి సినిమాపై పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకురావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. RRR మూవీ ఫినిష్ కాగానే రామ్ చరణ్ తదుపరి సినిమా విషయమై బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. చెర్రీతో చేయబోయే డైరెక్టర్ లిస్టులో యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, కొరటాల శివ, విక్రమ్ కె కుమార్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పటికే ఆయన చాలా కథలు విన్నట్లు చెప్పుకున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు రామ్ చరణ్ తదుపరి సినిమా ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి దిల్ రాజు నిర్మిస్తారని టాక్. బిగ్గెస్ట్ సినిమాలు రూపొందించడంలో దిట్ట అయిన శంకర్ తనదైన శైలిలో ఈ సినిమా రూపొందిస్తారని సమాచారం రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో రామ్ చరణ్- శంకర్ కాంబోలో సినిమా అంటూ నేషనల్ వైడ్‌గా ఓ ట్రెండ్ ప్రారంభమైంది. అందరిచూపు చెర్రీ 15వ ప్రాజెక్టుపైనే పడింది. సో.. చూడాలి మరి ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tQlxyf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...