Tuesday, 23 February 2021

Ramya Krishnan: ఇలాంటోళ్ళతో కలిసి పని చేసినా అదే ఫీలింగ్.. విజయ్ దేవరకొండపై రమ్యకృష్ణ కామెంట్స్

సరైన కంపెనీ దొరకాలే గానీ పని కూడా పార్టీ ఫీల్ తెప్పిస్తుందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. రౌడీ విజయ్ దేవరకొండతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. విజయ్‌ అండ్ టీమ్‌తో కలిసి పనిచేయడం తనకు చాలా సరదాగా అనిపిస్తోందని తెలిపేలా ఆమె ఈ కామెంట్ చేశారు. దీంతో ఈ వీరిద్దరి ఫొటో, చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రౌడీస్టార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ సహా పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రియాలిటీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు పూరి జగన్నాథ్. ఈ మేరకు విజయ్ దేవరకొండ బాక్సింగ్‌లో‌ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇటీవలే ముంబైలో మరో షెడ్యూల్ ఫినిష్ చేశారు. అయితే ఈ మూవీ సెట్స్‌పై విజయ్‌తో దిగిన పిక్‌ని తన ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేసిన రమ్యకృష్ణ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీలానే ఉంటుందని ఆమె పేర్కొంది. ఇప్పటివరకు విడుదలైన లైగర్ మూవీ అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. చిత్రాన్ని సెప్టెంబర్‌ 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aLziXK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...