Friday, 5 February 2021

Ram Charan: వరుణ్ తేజ్‌కి చెర్రీ ఫోన్.. మెగాస్టార్ మెచ్చారు ఇక నువ్వు ఫిక్స్ కావాల్సిందే అన్నారట!

ఓ ఇంట్రెస్టింగ్ విషయమై మెగా పవర్ స్టార్ , మెగా ప్రిన్స్ మధ్య ఫోన్ సంభాషణ నడిచిందని తెలుస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఓ విషయంపై మాట్లాడిన రామ్ చరణ్.. ఇక నువ్వు ఫిక్స్ కావాల్సిందే వరుణ్ అని చెప్పడంతో అన్నయ్య మాట కాదనలేదట వరుణ్ తేజ్ ఆలోచనలో పడ్డారట. మరి ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి? అనే కదా మీ సందేహం.. అక్కడికే వద్దాం. తాను చేయాలనుకునే ఓ మంచి కథను వరుణ్‌కి అప్పగిస్తూ తమ్ముడికి చెర్రీ కొన్ని సూచనలిచ్చారని తెలుస్తోంది. టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసి కథ కూడా రెడీ చేశారట. ఆ కథను రామ్ చరణ్, చిరంజీవిలకు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. అయితే అనుకోకుండా ప్రస్తుతం చెర్రీ చేస్తున్న RRR మూవీ ఆలస్యం కావడంతో ఆ కథను వరణ్ తేజ్ చేస్తే బావుంటుందని భావించిన రామ్ చరణ్ పని గట్టుకుని మరీ వరుణ్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని సమాచారం. మెగాస్టార్ మెచ్చిన ప్రాజెక్టు కాబట్టి దీనిపై వరుణ్ కూడా ఆలోచనలో పడ్డారని, త్వరలోనే ఆ నిర్మాతకు ఓకే చెప్పే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త దర్శకుడు కిరణ్ డైరెక్ట్ చేస్తున్న 'గని' సినిమాతో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నారు. ఇటీవలే ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. జూన్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3azK5CN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...