Tuesday, 9 February 2021

Pawan Kalyan: 'వకీల్ సాబ్'‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా యాంకర్ రష్మీ..! తెరపైకి క్రేజీ న్యూస్

సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ మొదటగా `వకీల్ సాబ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్ హిట్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌గా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన డైరెక్టర్ మరో స్పెషల్ అట్రాక్షన్ జోడించాలని ఫిక్సయ్యారట. ఈ మేరకు యాంకర్ రష్మీని రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే '' సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు మేకర్స్. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిత్రంలో ఎన్నో మార్పులు చేశారు. మరోవైపు పవన్ గ్రాండ్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి మెగా అభిమానుల ఈలలతో థియేటర్స్ హోరెత్తిపోవాలని భావించిన దర్శకనిర్మాతలు ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలనే కోణంలో ఆలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం జబర్దస్త్ బ్యూటీ రష్మీని దించితే ప్రేక్షకులకు మరింత ఊపు తెప్పించొచ్చు అని భావిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తుండగా.. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్ భార్య పాత్రలో శృతి హాసన్ కనిపించనుందని తెలిసింది. ఇటీవలే విడుదలైన 'వకీల్ సాబ్' టీజర్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టగా, తాజాగా యాంకర్ రష్మీతో స్పెషల్ సాంగ్ అనే అప్‌డేట్ ఆతృత పెంచేస్తోంది. సో.. చూడాలి మరి దీనిపై వకీల్ సాబ్ యూనిట్ ఏమంటుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aMvUdV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...