కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన .. అప్పుడప్పుడూ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కథాంశం 'నాంది'తో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పు పొందుతున్నారు. ప్రయోగాత్మకమైన ఈ కథ ఫిబ్రవరి 19వ తేదీన విడుదలైంది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. రోజు రోజుకూ ఈ మూవీ కలెక్షన్స్ పుంజుకుంటూ రావడం విశేషం. తొలి రెండు రోజులతో పోల్చితే మూడో రోజు కలెక్షన్స్ నిర్మాతలను ఆనంద పెట్టాయి. మూడో రోజు ఆదివారం కావడం, పైగా ఆడియన్స్ నుంచి మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు జరిగాయి. మూడో రోజుకు గాను 1.91 కోట్ల గ్రాస్, 1.04 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటాడు అల్లరి నరేష్. మూడోరోజు ఏరియావైజ్ రిపోర్ట్ చూస్తే.. నైజాం- 47 లక్షలు సీడెడ్- 15 లక్షలు ఉత్తరాంధ్ర- 6.2 లక్షలు ఈస్ట్ గోదావరి- 8.2 లక్షలు వెస్ట్ గోదావరి- 5.5 లక్షలు గుంటూరు- 8.4 లక్షలు కృష్ణా- 9 లక్షలు నెల్లూరు- 4.8 లక్షలు వసూలయ్యాయి. ఇక మొత్తంగా మూడు రోజుల కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి నైజాం- 93 లక్షలు సీడెడ్- 29 లక్షలు ఉత్తరాంధ్ర- 19 లక్షలు ఈస్ట్ గోదావరి- 16 లక్షలు వెస్ట్ గోదావరి- 12 లక్షలు గుంటూరు- 17 లక్షలు కృష్ణా- 18 లక్షలు నెల్లూరు- 10 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.86 కోట్ల గ్రాస్, 2.14 నెట్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 4.05 కోట్ల గ్రాస్, 2.28 కోట్ల షేర్ వసూలైంది. రెండో వారం కూడా ఇదే జోష్ కంటిన్యూ చేస్తే త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qOO4CE
v
No comments:
Post a Comment