అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర, వెండితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తికాదు. అంత బాగా ఆమె ప్రేక్షకులకు దగ్గరైపోయారు. ఒకవైపు టీవీలో షోలు చేస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఒక వైపు ఫ్యామిలీని, ఇంటిని చూసుకుంటూ మరోవైపు తన ప్రొఫెషనల్ వర్క్‌కు న్యాయం చేస్తూ సమయాన్ని చాలా బాగా మ్యానేజ్ చేస్తూ జీవిస్తున్నారు అనసూయ. తాను ఎవరి సలహాలు తీసుకోనని.. తనకు నచ్చినట్టు తాను ఉంటానని ఎప్పుడూ చెప్పే అనసూయ, తాజాగా ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలోనూ తన అభిమానులకు అదే చెప్పారు. టీవీ, సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అనసూయ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఆమె ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్‌లు అప్‌లోడ్ చేస్తూ యువతకు నయనానందాన్ని కలిగిస్తున్నారు. ఇక యూట్యూబ్ ద్వారా తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా యూట్యూబ్‌లో అనసూయ ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ద్వారా తన ఇంట్లో తనకు చాలా ఇష్టమైన ప్రదేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అనసూయకు తన ఇంట్లో బాల్కనీ ఏరియా అంటే చాలా ఇష్టమట. ఆ బాల్కనీ ప్లేస్‌ను చాలా అందంగా అలంకరించుకున్నారు అనసూయ. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడానికి చిన్న వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వుడెన్ డైనింగ్ టేబుల్, సోఫా, పక్షులు, ఇంటిలోపల పెంచుకునే చిన్న చిన్న మొక్కలతో బాల్కనీ ఏరియా చాలా అందంగా ఉంది. అందుకే ఇక్కడే రోజూ ఆమె రెండు మూడు గంటలు గడుపుతారట. ఒకప్పుడు జాగింగ్ కోసం బయట పార్క్‌కు వెళ్లేదాన్ని అని.. అయితే, బయటకు వెళ్లడం వల్ల తనతో పాటు పార్క్‌లో ఉన్నవాళ్లు ఇబ్బంది పడుతున్నారని అందుకే ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నానని అనసూయ వెల్లడించారు. ఇంకా అనసూయ చెప్పిన విశేషాలు ఈ వీడియోలోనే చూడొచ్చు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kkbltA
v
No comments:
Post a Comment