Saturday, 13 February 2021

రాధే శ్యామ్ టీజర్: నేను వాడిలా ప్రేమకోసం చచ్చే టైప్ కాదు.. ప్రభాస్ వెరీ రొమాంటిక్, లవర్స్‌కి బిగ్ సర్ ప్రైజ్

వాలెంటైన్స్ డే నాడు ప్రేమికులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఫిబ్రవరి 14న బిగ్ సర్ ప్రైజ్ ఉండబోతుందని ముందే ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా రాధేశ్యామ్ గ్లింప్స్ టీజర్‌ను విడుదల చేసింది. ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్న ప్రభాస్.. లవర్ బాయ్‌గా మెరిసాడు ఈ టీజర్‌లో. ప్రేయసి వెనుకపడే రోమియోగా సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? అని మన బుట్టబొమ్మ పూజా హెగ్డే అంటుండగా.. ఛ!! వాడు ప్రేమకోసం చచ్చాడు నేను ఆ టైప్ కాదు’ అంటూ హీరోయిన్ కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ చెప్పే డైలాగ్‌ కుర్ర హృదయాలను కొల్లగొట్టేట్టుగానే ఉంది. మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చే బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ లుక్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2N3jg2d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...