Friday, 26 February 2021

శ్రీ రెడ్డి 'క్లైమాక్స్'కి సెన్సార్ బోర్డు క్లియరెన్స్.. రిపోర్ట్ చూస్తే!!

సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న వెండితెరపై తన ప్రతాపం చూపించే సమయం వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక ఆరోపణలతో విరుచుకుపడుతున్న ఆమె '' అనే మూవీ పూర్తి చేసింది. ఇందులో తన లైఫ్‌కు దగ్గరగా ఉండే క్యారెక్టర్‌లో నటించిందట శ్రీ రెడ్డి. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫినిష్ అయిన నేపథ్యంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. `డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఈ 'క్లైమాక్స్' చిత్రాన్ని మార్చి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు దర్శకనిర్మాతలు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రోల్ మేజర్ అట్రాక్షన్ అయింది. ఆయన రోల్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలి ఉండటం, అతనికి అమ్మాయిల వీక్నెస్ ఉండటం సినిమాలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు నటించారు. క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుందని నిర్మాతలు చెబుతుండటం సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తోంది. సో.. చూడాలి మరి 'క్లైమాక్స్'తో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aY8hjU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...