Friday, 26 February 2021

మెగా, అక్కినేని కాంబోలో మూవీ.. నాగార్జునతో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాకే హ్యూజ్ రెమ్మ్యూనరేషన్

కుటుంబ అండదండలు ఎన్ని ఉన్నా టాలెంట్ లేనిదే సక్సెస్ అనేది అంత ఈజీగా దరిచేరదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ అందులో సక్సెస్ అనుకుంటోంది కొందరే. నటీనటులు కనబర్చే ప్రతిభ, సినిమా కంటెంట్‌లో ఉన్న సత్తానే వారి వారి కెరీర్‌కి బూస్టింగ్ అవుతుంది. అలానే సినీ వారసుడిగా తెరంగేట్రం చేసిన మెగా మేనల్లుడు .. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో తెలుగు దర్శకనిర్మాతల చూపు ఈ యువ హీరోపై పడింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునతో సినిమా చేసే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన వైష్ణవ్ తేజ్.. కెమెరా ముందు అద్భుతమైన నటన కనబర్చి పులువురు సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. నాచురల్ లుక్, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో 'ఉప్పెన' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు ముందుకొచ్చారట. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్న నాగార్జున.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బానర్‌పై ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మొదటి సినిమా 'ఉప్పెన'కు 50 లక్షల పారితోషికం తీసుకున్న వైష్ణవ్‌కి ఏకంగా మూడు కోట్ల రుపాయల భారీ ఆఫర్ ఇచ్చారట నాగార్జున. ఈ మేరకు డిఫరెంట్ కథను ఎంచుకున్న నాగ్.. ఈ సినిమాను కొత్త ఓ దర్శకుడితో రూపొందించబోతున్నారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O0aceA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...