స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద కార్‌వాన్ ప్రమాదానికి గురైంది. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, ఆయన కారవాన్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్‌వాన్‌లో బన్నీ లేకపోవడంతో ఆయనకి ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారవాన్‌లో బన్నీ మేకప్ టీం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కారవాన్ వెనుక భాగం దెబ్బతింది. శనివారం నాడు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో 'పుష్ప' చిత్రం షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ కారవాన్ పై AA (అల్లు అర్జున్) పేరుతో కూడిన సింబల్ ఉండడంతో హీరో కారవాన్‌లో ఉన్నారనుకుని స్థానికులు భారీగా గుమిగూడారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా.. అల్లు అర్జున్-సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగష్టు 13న ‘పుష్ప’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా నటించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rwvEpQ
v
No comments:
Post a Comment