Sunday, 28 February 2021

క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ సినిమా టైటిల్ ఫిక్స్.. ఫైనల్‌గా డిసైడ్ అయ్యారిలా!

తొలి సినిమా 'ఉప్పెన'తో భారీ సక్సెస్ అందుకున్నారు మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా రంగంలోకి దిగిన ఈ నటుడు, కెమెరా ముందు తన హావభావాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన రెండో సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఆయన.. ఈ సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రెజెంట్ పవన్‌కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్న క్రిష్.. దానికి ప్యారలల్‌గా మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌‌తో చేస్తున్న సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన క్రిష్.. టైటిల్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారట. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే చిత్రానికి 'జంగిల్‌ బుక్‌' అనే టైటిల్‌ ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. కొండ మీద నివాసం ఉండే ఓ గ్రామంలోని ప్రజలు అక్కడ వ్యవసాయం చేయడం, అడవుల్లోని జంతువులతో వారి సావాసం, అక్కడి వాతావరణంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే కథాంశంతో సినిమా తెరకెక్కిందని తెలిసింది. 'ఉప్పెన'తో సక్సెస్ అందుకున్న వైష్ణవ తేజ్.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్‌కి వరుస అవకాశాలు వస్తున్నాయని, ఇప్పటికే నాగార్జున నిర్మాణంలో రూపొందనున్న ఓ సినిమాకు వైష్ణవ్ ఓకే చేశారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZUJl6o
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...