Friday, 12 February 2021

మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసే ఛాన్స్ పట్టేసిన శృతిహాసన్.. చెక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

కమల్ హాసన్ నట వారసురాలిగా వెండితెరపై కాలుమోపిన అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషా చిత్రాల్లో నటించి సత్తా చాటిన ఈ అమ్మడు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు కొట్టింది. ఇక సినిమాలు చేయదేమో అనుకుంటున్న సమయంలో తిరిగి కెమెరా ముందుకొచ్చి చకచకా రవితేజతో 'క్రాక్' ఫినిష్ చేసి సక్సెస్ అందుకుంది. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `వకీల్ సాబ్` లోనూ నటించింది. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్‌కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని సమాచారం. కాగా ఆమె సినిమాలకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేసే ఛాన్స్ ఆమె సొంతమైందని అంటున్నారు. మెగాస్టార్ అప్‌కమింగ్ ప్రాజెక్టులో శృతిని హీరోయిన్‌గా తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. హీరోగా డైరెక్టర్ రూపొందించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఈమెనే ఫైనల్ చేయాలని చూస్తున్నారట. పవర్‌ఫుల్ ఎమోషనల్ కథతో బాబీ ఈ చిత్ర కథ రెడీ చేస్తున్నారని తెలిసింది. స్క్రిప్ట్ పనులను వేగవంతం చేసిన ఆయన.. చిరంజీవి కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా తన మూవీ నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చిరంజీవి తన 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది పూర్తయిన వెంటనే 'లూసిఫర్' తెలుగు రీమేక్‌ సెట్స్ మీదకు రానున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రీమేక్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d7NjjJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...