Wednesday, 10 February 2021

దుస్తులన్నీ ఊడదీయాలి, ప్యాంటీ కనిపించాలి అనడంతో! డైరెక్టర్ బండారం బయటపెట్టిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ బ్యూటీగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా సత్తా చాటుతోంది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన ఆమె, ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తూ హవా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకేసి తన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను పొందుపర్చుతూ 'అన్‌ఫినీష్‌డ్' (Unfinished) అనే పేరుతో ఓ పుస్తకం రిలీజ్ చేసింది ప్రియాంక. ఇందులో ఆమె ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తన జ్ఞాపకాలన్నింటినీ పొందుపరిచిన ఈ Unfinished పుస్తకం ఫిబ్రవరి 9 (మంగళవారం) విడుదలైంది. ఇందులో తన సినిమా షూటింగ్స్‌లో తనకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ అన్నీ ఓపెన్‌గా వివరించింది ప్రియాంక చోప్రా. యూపీలోని ఓ చిన్న గ్రామం నుంచి సినీ రంగ ప్రవేశం, మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకొనే వరకు పలు విషయాలను వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో తనను దర్శకులు చులకనగా చూశారని తెలుపుతూ ఓ దర్శకుడితో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఒక సినిమా కోసమై ఓ ఐటెం సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తనను దుస్తులు ఊడదీయమన్నాడని పేర్కొంది. ఒక్కొక్క షాట్‌లో ఒక్కో వస్త్రం వదిలేస్తూ నీ ప్యాంటీ కనిపించాలని ఆయన చెప్పడంతో షాకయ్యానని చెప్పింది. అయితే అందుకు నిరాకరిస్తూ శరీరం కనిపించకుండా చర్మ రంగుతో ఉండే దుస్తులను వేసుకొంటానని ఆ డైరెక్టర్‌తో చెప్పగా, ఆయన కోపంతో ఊగిపోయాడని తెలిపింది. చివరకు స్టైలిష్‌తో మాట్లాడగా ఆయన కూడా అదే చెప్పాడని ఆ పుస్తకంలో పేర్కొంది. మీరు ఏదైనా వేసుకోండి. కానీ మీరు ధరించిన ప్యాంటీలు కూడా తెరపైన కనిపించాలి. వాటిని చూడటానికే ప్రేక్షకులు సినిమాకు వస్తారని డైరెక్టర్ చెప్పినట్టు స్టైలిష్ట్ చెప్పడంతో తనకు విపరీతమైన కోపం వచ్చి ఆ సినిమా నుంచి తప్పుకున్నానని ప్రియాంక వెల్లడించింది. ఈ విషయమై తన తరఫున సల్మాన్ జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అంతటితో ఆగిపోయిందని చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cZTRB9
v

No comments:

Post a Comment