సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకర కామెంట్స్‌పై యాంకర్ ఏ రేంజ్‌లో రియాక్ట్ అవుతుందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ ఆమెపై ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో అనసూయను టార్గెట్ చేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు. తాజాగా నెట్టింట ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడింది అనసూయ. నిరంతరం సామజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే సెలబ్రటీల్లో యాంకర్ అనసూయ ఒకరు. ఎప్పుడూ తనకు సంబంధించిన రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకోవడమే గాక.. ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అందరి చూపు తనపై పడేలా చేసుకుంటుంది. అందుకే ఈ జబర్దస్త్ బ్యూటీకి ఆన్‌లైన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కొంతమంది ఆకతాయిలు అనసూయను టార్గెట్ చేస్తుండటం చూస్తున్నాం. మూడేళ్ల క్రితం అనసూయ ఓ ఈవెంట్‌లో అనుకోకుండా కళ్లు తిరిగి పడిపోయింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రచారం కోసమే అనసూయ ఇలా కళ్లు తిరిగిపడిపోయినట్లు యాక్టింగ్ చేసిందంటూ తాజాగా ఓ కామెంట్ వదిలాడు నెటిజన్. దీంతో ఇది చూసిన అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎపుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని ఏదోదే మాట్లాడుతున్నావంటూ సదరు నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా ఈజీ. ఆ సమయంలో నాకు లోబీపీ ఉంది. 22 గంటలపాటు నిర్విరామంగా షూట్‌లో పాల్గొనడంతో కళ్లు తిరిగిపడిపోయాను. దాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నారు. నన్ను అసభ్యంగా ధూషించాలని టార్గెట్ చేసి మూడేళ్ల క్రితం వీడియో చూసి ఇలా కామెంట్ చేస్తున్నావా? కౌంటర్ ఇవ్వకపోతే.. ముందు ముందు మీలాంటి వాళ్లు మా పై మరింత బురద జల్లే అవకాశం ఉంది. నేను కూడా నీపై అసభ్యపదజాలం వాడగలను. కానీ, మా తల్లిదండ్రులు అలా పెంచలేదు'' అని పేర్కొంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది అనసూయ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Yo81p
v
No comments:
Post a Comment