Monday, 22 February 2021

కీర్తి సురేష్‌తో మహేష్ బాబు గోవా ట్రిప్.. సూపర్ స్టార్‌తో 'సర్కారు వారి పాట' టీమ్ స్కెచ్!!

''భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు'' లాంటి భారీ విజయాల తర్వాత సూపర్ స్టార్‌ హీరోగా రాబోతున్న సినిమా ''. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. ఈ మేరకు గ‌త నెల రోజులుగా దుబాయ్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపిన యూనిట్.. తాజాగా ఆ షెడ్యూల్ ఫినిష్ చేసేసింది. దుబాయ్ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు మహేష్, కీర్తిసురేష్‌ల‌పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. అక్కడ మహేష్ బాబు ఇంట్రడక్షన్ ఫైట్ కంప్లీట్ చేశారట. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం గోవా ట్రిప్ ప్లాన్ చేశారని, అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో మహేష్, కీర్తిసురేష్‌ల‌పై ఓ సాంగ్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గోవా బీచ్‌లో ఈ స్పెషల్ డ్యూయెట్‌ ప్లాన్ చేశారట దర్శకుడు పరశురామ్. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసేందుకు గాను దుబాయ్ నుంచి నేరుగా గోవా వెళ్లనుందట 'సర్కారు వారి పాట' టీమ్. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ 'సర్కారు వారి పాట' సినిమాను నిర్మిస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మహేష్ అభిమానులు పెట్టుకున్న అంచనాలకు రెక్కలు కట్టాయి. 2022 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NNhUIS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...