Saturday, 13 February 2021

‘టక్ జగదీష్’ తొలి పాట.. నానితో ‘ఇంకోసారి’ అంటున్న గుమ్మడి వరలక్ష్మి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు వచ్చాయి. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ఈ పాట కూడా చాలా బాగుంది. ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎద‌లో చేరి’ అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరిక‌ల్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. తమన్ స్వరపరిచిన ఈ మధురమైన పాటకు చ‌క్కని ప‌ద‌బంధాల‌తో సాహిత్యం అందించారు చైత‌న్య ప్రసాద్‌. శ్రేయా ఘోష‌ల్‌, కాల‌భైర‌వ గానం ఈ పాటకు మ‌రింత అందాన్ని తీసుకొచ్చింది. చిత్రంలో ఈ పాట‌ను నాని, రీతూవ‌ర్మపై చిత్రీక‌రించారు. వారిద్దరి జంట చూడ‌ముచ్చట‌గా ఉంది. పాట ప్రారంభం కావడానికి ముందు వీడియోలో రీతూవర్మ, నాని కనిపిస్తారు. రీతూను నాని ‘గుమ్మ’ అని పిలుస్తారు. ఆమె పేరు గుమ్మడి వరలక్ష్మి. షార్ట్ కట్‌లో గుమ్మ అని నాని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ గుమ్మే జగదీష్ కోసం ఈ పాట పాడింది. కాగా, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా చేశారు శివ నిర్వాణ. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్టర్‌గా బాధ్యత‌లు నిర్వర్తించారు. నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rTb5Ee
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...