Saturday, 27 February 2021

శ్రీవారిని ద‌ర్శించుకున్న ఉప్పెన టీమ్.. కాలినడక కొండెక్కిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి

'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా తోనే సూపర్ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా 'ఉప్పెన' టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆనందంలో టీమ్ అంతా కలిసి నేడు (శనివారం) తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. , కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు అంతా కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కాలినడకన కొండెక్కడం విశేషం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందాము. ఆ ఆశీస్సులతో ఉప్పెన సినిమా విజ‌యం సాధించింది. తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందా. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తా'' అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37RMIQ6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...